కలం, స్పోర్ట్స్: భోపాల్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ (Asian Champions Trophy)లో చైనాను 6-2తో చిత్తు చేసింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా నాలుగో గెలుపును నమోదు చేసింది. భారత స్టార్ ప్లేయర్ దీపిక హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసింది. మ్యాచ్ తొలి నిమిషంలోనే దీపిక గోల్ చేసింది. ఆరో, 14వ నిమిషాల్లోనూ గోల్స్ సాధించి హ్యాట్రిక్ పూర్తి చేసింది. 19వ నిమిషంలో లాల్‌రెంసియామి, 22వ నిమిషంలో నేహా గోల్స్ చేశారు. దీంతో తొలి అర్ధభాగంలో భారత్ 5-1 ఆధిక్యంలో నిలిచింది.
మూడో క్వార్టర్‌లో సాక్షి 38వ నిమిషంలో ఆరో గోల్ చేసింది. చైనా తరఫున ఫెంగ్ కింగ్‌మియావో, చెన్ టింగ్టింగ్ గోల్స్ సాధించారు. చివరికి భారత్ 6-2తో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే మలేషియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లపై గెలిచిన భారత్.. తాజాగా చైనాపై విజయంతో తన జైత్రయాత్ర కొనసాగించింది. తదుపరి మ్యాచ్‌లో నవంబర్ 25న జపాన్‌తో తలపడనుంది.

