ముంబై పగ్గాలు మళ్లీ రోహిత్ చేతికే..!

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వ్యూహాలపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జియోస్టార్ షోలో ఆయన మాట్లాడుతూ, వచ్చే సీజన్ కోసం ముంబై పగ్గాలను మళ్లీ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించాలని సూచించారు. ఒక్క ఏడాది పాటు రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించి, తదుపరి మెగా వేలం తర్వాత తిలక్ వర్మను పూర్తిస్థాయి కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తుండగా, తిలక్ వైస్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

మినీ వేలంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంపై దృష్టి పెట్టాలని చోప్రా తెలిపారు. స్పిన్నర్లు అల్లా గజన్‌ఫర్, మయాంక్ మార్కండేలను వదులుకోవడంతో, వారి స్థానంలో కొత్త స్పిన్నర్లను తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే ఒకరిద్దరు భారత ఫాస్ట్ బౌలర్లను కూడా జట్టులోకి చేర్చుకోవాలని సూచించారు. ఫ్రాంచైజీల వద్ద సుమారు 300 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని, ఖాళీలు తక్కువగా ఉండటంతో వేలంలో ఆటగాళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చోప్రా విశ్లేషించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>