న్యాయవాదుల నిర్బంధం: SCBA అత్యవసర తీర్మానం!

కలం, వెబ్ డెస్క్ : నిరసన ర్యాలీ చేపట్టిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం పట్ల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి జంతర్ మంతర్ వైపు బయలుదేరిన న్యాయవాదులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు బలప్రయోగానికి పాల్పడి అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండించింది.

ఈ ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ SCBA ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అకారణంగా అదుపులోకి తీసుకున్న న్యాయవాదులందరినీ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీజేఐకి విజ్ఞప్తి చేసింది. అలాగే, శాంతియుత నిరసనపై బలప్రయోగానికి పాల్పడిన పోలీసు అధికారులపై ఉన్నత స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>