కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలోని (Anakapalli) ఓ ఫార్మా కంపెనీలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంబెల్లి సెజ్ లోని ఎస్వీఎస్ రసాయన పరిశ్రమలో (SVS Chemical Industry) పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. దీంతో పరిసరాల్లో మొత్తం పొగ అలముకుంది. అగ్ని ప్రమాదం సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో జనాలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: అమరావతి రెండో విడత భూసేకరణ ప్రారంభం..
Follow Us On: X(Twitter)


