పాకిస్థాన్(Pakistan),అప్ఘనిస్థాన్(Afghanistan) మధ్య యుద్ధం మొదలైంది. పాక్ వైమానిక దాడితో ఈ రెండు దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) స్పందించారు. పాక్-అప్ఘన్ మధ్య యుద్ధాన్ని ఆపడం పెద్ద విషయం కాదన్నారు. అది తనకు చాలా ఈజీ పని అని చెప్పారు. తాను ఇప్పటికే పలు యుద్ధాలు ఆపి లక్షల్లో ప్రజలను కాపాడానని పేర్కొన్నారు. దీంతో మరోసారి ట్రంప్ హాట్‌టాపిక్‌గా మారారు. ఇటీవల కాలంలో యుద్ధమంటే అందరికన్నా ముందు ట్రంప్(Trump) ఉంటున్నారు. తాను యుద్ధాన్ని ఆపుతానంటూ ఎవరితో మాట్లాడకుండానే ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పాక్-అప్ఘన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. ఇందులో అప్ఘన్ క్రికెటర్లు ముగ్గురు సహా మరో ఎనిమిది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారు దేశవాళీ క్రికెటర్లు హరూన్, కబీర్, సిబాతుల్లాలుగా అధికారులు గుర్తించారు. వచ్చే నెలలో పాక్, శ్రీలంకతో జరిగే ట్రై నేషన్ సిరీస్‌లో అఫ్గాన్ తరపున జట్టులో ఆ ముగ్గురు ఉన్నారు. ఈ దాడి కారణంగా ట్రై సిరీస్ నుంచి అప్ఘనిస్థాన్ తప్పుకుంది.

