పంజాబ్ గరీబ్‌రథ్ రైలు(Garib Rath Train)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోచ్ నెం.19లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానిని గమనించిన ప్రయాణికులు వెంటనే చెయిన్ లాగి రైలును ఆపారు. వెంటనే ప్రయాణికులంతా రైలు దిగేశారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కాగా, ఒక ప్రయాణికురాలికి మాత్రం తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అమృత్ సర్ నుంచి సహర్షా వెళ్తుండగా అంబాలా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా అసలు ప్రమాదానికి కారణం ఏంటి? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: బీసీ బంద్‌లో కవిత కుమారుడు..

