కలం, వెబ్ డెస్క్ : వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో వెహికల్స్ ట్యాక్స్ విధానంలో మార్పులు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలపై కేంద్ర మోటార్ వాహన చట్టం ప్రకారం ఇక నుంచి రోడ్ సేఫ్టీ సెస్ (Road Safety Cess) విధిస్తున్నట్టు తెలిపారు మంత్రి. టూ వీలర్ వాహనాలకు అంటే బైకులకు రూ.2వేలు, లైట్ మోటార్ వాహనాలకు రూ.5వేలు, హెవీ వెహికల్స్ కు రూ.10వేలు రోడ్ సేఫ్టీ సెస్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కేవలం కొత్తగా రిజిస్టర్ అయ్యే వాటికి మాత్రమే ఇది (Road Safety Cess) వర్తిస్తుందని తెలిపారు. ఆటోలు, ట్రాక్టర్లకు ఈ కొత్త ట్యాక్స్ విధానం వర్తించబోదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విధానాన్ని ఇప్పటికే ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు మంత్రి పొన్నం తెలిపారు. జవవరి 1 నుంచి 31వరకు జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Read Also: కేంద్ర జలశక్తి కమిటీతో తెలంగాణకు నష్టమే : హరీష్ రావు
Follow Us On: Instagram


