కలం, వెబ్ డెస్క్ : కేంద్ర జలసంఘం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీతో తెలంగాణకు నష్టమే జరుగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి ఈ కమిటీ వేయడమే పెద్ద నిదర్శనం అని ఆరోపించారు. ఆ కమిటీలో తెలంగాణ నుంచి ఇంటర్ స్టేట్ అధికారి లేకపోవడం వల్ల తెలంగాణకు పెద్ద నష్టమే జరుగుతుందన్నారు. ఏపీ నుంచి ఇంటర్ స్టేట్ అధికారి ఉండి తెలంగాణ నుంచి ఎందుకు లేరని ప్రశ్నించారు.
‘ఏపీ తరఫున ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఇంజినీర్లు ఉంటే.. తెలంగాణ నుంచి ముగ్గురు ఐఏఎస్ లు, ఒక ఇంజినీర్ మాత్రమే ఉన్నారు. తెలంగాణ నుంచి అనుభవం ఉన్న సీనియర్ ఇంటర్ స్టేట్ అధికారి లేకపోవడం అంటే తెలంగాణకు గొడ్డలిపెట్టులాంటిదే అన్నారు. మూడు నెల్లలో ఆ కమిటీ పంపకాలు పూర్తి చేస్తుందంట. అంటే నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఈజీగా ఆమోదం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిటీతో తెలంగాణకు న్యాయం జరగదు’ అని హరీష్ రావు చెప్పారు.

Read Also: దేశంలో ప్రమాదకరంగా ‘వైట్కాలర్’ ఉగ్రవాదం: రాజ్నాథ్ సింగ్
Follow Us On: Sharechat


