epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జల్లికట్టులో ఐదుగురికి తీవ్ర గాయాలు

కలం, వెబ్​డెస్క్​: సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో జరిగిన జల్లికట్టు (Jallikattu) వేడుకల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా, వేడుక కోసం ఆంధ్రప్రదేశ్​తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 200కు పైగా ఎద్దులు బరిలోకి దిగాయి. వీటిని లొంగదీసుకునేందుకు యువకులు ఉత్సాహంగా, ధైర్యంతో పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఎడ్ల వేగానికి చాలా మంది కిందపడి గాయాలపాలయ్యారు. వీరిలో తీవ్రంగా దెబ్బలు తగిలిన ఐదుగురిని హాస్పిటల్​లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

జల్లికట్టు (Jallikattu) తమిళనాడు సంప్రదాయ క్రీడ. ఏటా సంక్రాంతి మూడో రోజు ఆ రాష్ట్రంతోపాటు సరిహద్దు జిల్లా అయిన ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ జల్లికట్టును వైభవంగా నిర్వహిస్తారు. అయితే, పండుగకు కొన్ని రోజుల ముందు కూడా చాలా గ్రామాల్లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో పోటీ కోసం సిద్ధం చేసిన ఎద్దు కొమ్ములకు బంగారు లేదా వెండి నాణేలను తాడుతో కడతారు. అనంతరం జన సమూహం మధ్యలో ఆ ఎద్దును వదులుతారు. ఎవరైతే ఆ ఎద్దు మూపురం గట్టిగా పట్టుకొని, అదుపు చేస్తారో వాళ్లకు ఆ నాణేలు ఇస్తారు. పులికులం లేదా కంగాయం అనే ఒక రకం ఎద్దులను మాత్రమే ఈ పోటీలకు అనుమతిస్తారు. ఏ ఎద్దు అయితే, ఎవరికీ లొంగకుండా పోటీలో నెగ్గుతుందో దానికి మార్కెట్​లో ఎక్కువ రేట్​ పలుకుతుంది. జల్లికట్టునే తమిళనాడులో సల్లికట్టు అని కూడా అంటారు.

Read Also: వాహనదారులకు షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>