కలెక్టరేట్ వేదికగా రేవంత్ .. బండి సంజయ్ విభేదాల రచ్చ!

కలం, ​కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన (Karimnagar Collectorate) ప్రారంభోత్సవ వేడుక స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పరిపాలనా ప్రారంభోత్సవంగా జరగాల్సిన ఈ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ల మధ్య ముదిరిన రాజకీయ విభేదాలను, ప్రత్యక్ష వ్యాఖ్యల యుద్ధాన్ని బయటపెట్టింది.

‘ప్రోటోకాల్ .. ఐడెంటిటీ’ పోరు!

విభేదాలకు మూలం ఇక్కడే మొదలైంది. కలెక్టర్ చిత్ర మిశ్రా నూతన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో జరిగిన పరిణామాలు ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా నిలిచాయి. మొదట హిందూ సంప్రదాయాల ప్రకారం ఆశీర్వచనాలు పూర్తయిన తర్వాత సీఎం , కేంద్ర మంత్రి బయటకు వెళ్లేందుకు సిద్ధమవగా కాంగ్రెస్ ఇంఛార్జి మంత్రి జోక్యం చేసుకుని ‘సర్వమత ప్రార్థనలు’ ఉన్నాయని తెలిపారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఛాంబర్‌లోనే ఉండిపోగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ప్రార్థనల ఘట్టంలో పాల్గొనకుండా నిష్క్రమించడం పెద్ద దుమారమే రేపింది. ​స్థానికంగా సాగుతున్న ప్రధాన చర్చల్లో ​కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వేదికపై ‘సర్వమత కార్డు’ ఉపయోగించి తమను ఇరకాటంలో పెట్టాలని చూసిందని, అందుకే బండి సంజయ్ (Bandi Sanjay)  వాకౌట్ రూపంలో తన నిరసనను వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి  స్థానంలో ఉండి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలను తిరస్కరించడం సరైన సంస్కృతి కాదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ​బీఆర్ఎస్ విమర్శలు మరోవైపు ఈ వేడుకల అనంతరం సీఎం ప్రసంగించిన వేదికపై ఇద్దరు నాయకులు పక్కపక్కనే కూర్చోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.

లోపల బయటకు వెళ్లడం.. బయట వేదికపై కలిసి నవ్వడం ఇదంతా కాంగ్రెస్, బీజేపీ‌ల ‘డ్రామా’ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్ (Karimnagar Collectorate) ప్రారంభోత్సవ సంఘటన రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య రాజకీయాలు ఎంత వేడెక్కనున్నాయో స్పష్టం చేసింది. ప్రభుత్వ వేదికను కూడా ఇరు పార్టీల నాయకులు తమ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నారనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Also Read : ఎన్నికల కమిషన్ పై సుప్రీంకోర్టు​ విచారణ చేపట్టాలి : కేటీఆర్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>