కారుణ్య నియామకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా 

కలం, జోగులాంబ గద్వాల: కారుణ్య నియామకం కింద నలుగురికి ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులపై ఉద్యోగ నియామక ఉత్తర్వులను బుధవారం ఐడీఓసీ కలెక్టర్‌ చాంబర్‌లో గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్ (Rizwan Basha Shaik) అందజేశారు. నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి ఇంటర్మీడియట్‌ శాఖలో, మరో అభ్యర్థికి విద్యాశాఖలో ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన కారుణ్య నియామక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ బాధ్యతలను అంకితభావంతో, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఉద్యోగ జీవితంలో మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, కలెక్టరేట్ ఏఓ మంజుల, తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>