నేను దరఖాస్తు చేసుకున్నా.. మరి మీరు?: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తాను ఓటు దరఖాస్తు చేసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని.. అందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్–హైదరాబాద్–రంగారెడ్డి, వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల స్థానాల్లోని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులకు ఓటు హక్కు నమోదును అత్యంత ప్రాధాన్యంగా గుర్తించి అవగాహన కల్పించాలన్నారు.

మళ్లీ మనదే గెలుపు..

ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతున్న ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె వాణీదేవిని నిలబెట్టి గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ మనమే గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై యువత తీవ్ర వ్యతిరేకత ఉన్నారని వివరించారు. దీన్ని పార్టీ నేతలు అందిపుచ్చుకుని.. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. యువతరానికి దూరమవుతున్నామనే ఆవేదన బీజేపీ అగ్ర నేతలే చెబుతున్నారని.. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

Also Read : SIR గో బ్యాక్ నినాదంతో ఉద్యమిస్తాం : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>