ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) విషాదాన్ని నింపింది. సంగారెడ్డి మార్గంలో శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ (Traffic Head Constable) తాహెర్ సాహెబ్ (Taher Saheb) ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాహెర్ సాహెబ్ తన కుమారుడితో కలిసి నర్సాపూర్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో జరిగిన విందుకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇద్దరూ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ క్రమంలో సంగారెడ్డి మార్గంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాహెర్ సాహెబ్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించే పోలీసు అధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తోటి సిబ్బందిని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>