చార్మినార్ వద్ద కలకలం.. గ్యారహ్వీ షరీఫ్ ఊరేగింపులో ఏనుగు హల్‌చల్!

కలం, వెబ్ డెస్క్ : పాతబస్తీలోని చార్మినార్ (Charminar) సమీపంలో గ్యారహ్వీ షరీఫ్ ఊరేగింపు (Gyarahwi Sharif Procession) సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న ఏనుగు (Elephant) ఒక్కసారిగా పరుగులు తీయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏనుగు కదలికల్లో ఇబ్బంది తలెత్తడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏనుగు అకస్మాత్తుగా వేగంగా కదలడంతో ఊరేగింపును వెంటనే నిలిపివేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కూడా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.

మహావత్ సహాయంతో అధికారులు ఏనుగును అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొంతసేపటి ప్రయత్నం అనంతరం పరిస్థితిని చక్కదిద్ది, ఏనుగును అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో ఊరేగింపులో పాల్గొన్నవారు, స్థానికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో పరిస్థితి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊరట చెందారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>