కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం గుట్టుగా బీజేపీకి సహకరిస్తూనే.. ఒకరకంగా ఎన్నికల రిగ్గింగ్ చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి ఎన్నికల ముందు బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తే ఇదే విషయం అర్థమవుతోందన్నారు. లేకపోతే ఎన్నికల ఫలితాలు ముందే వారికి నెంబర్లతో సహా ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. దేశ ప్రజలు వారి తీరుతో ఎంతమాత్రం సంతోషంగా లేదని వెల్లడించారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి అంతా జ్ఞానేష్ కుమార్ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు వివరించారు.
పెద్దల అండ లేకుంటే సాధ్యమా..?
ప్రస్తుతం ఎన్నికల సంఘం చేస్తున్నదంతా అక్రమమేనని.. జ్ఞానేష్ కుమార్‌ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలిపారు.. కేంద్ర పెద్దల అండ లేకుండా ఒక వ్యక్తి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైన పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వారి అండ ఉన్నందునే ఇలాంటి అక్రమ పనులు స్వేచ్ఛగా చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా.. వారు ఎంతటి స్థానంలో ఉన్నా తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. తాము చేసిన చట్ట వ్యతిరేక పనులకు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు.
Also Read : సింధు దూకుడు.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది!
Follow Us On: X(Twitter)

