స్నేహ సొసైటీలో ఘనంగా పండిత్ దీన్‌దయాల్ జయంతి వేడుకలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) మారుతి నగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు హాజరై పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్నేహ సొసైటీ ఏర్పాటు ఏ విధంగా ఏర్పడింది, ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించింది వారి ఆరోగ్య పరిస్థితులు ఇలా ప్రతి విషయాన్ని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతిలు ముఖ్య అతిథులకు వివరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ స్నేహ సొసైటీ పై ప్రశంసలు కురిపించారు. అంధ, మానసిక దివ్యాంగ విద్యార్థులకు తానున్నానంటూ మనోధైర్యం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న స్నేహ సొసైటీ పాఠశాల కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, అలాగే సిబ్బందిని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు అభినందించారు.

1995లో ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతోమంది దివ్యాంగ విద్యార్థుల ఉన్నతి కోసం పాటుపడడం స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు ఎస్. సిద్ధయ్య, జ్యోతి దంపతులుకే దక్కిందని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. అలాగే అంధ, మానసిక, దివ్యంగ విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపుతూ.. నేనున్నానంటూ అక్కున చేర్చుకొని వారి భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తూ.. బంగారు బాటాలు వేస్తూ కృషి చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.

స్నేహ సొసైటీల నుంచి ఇప్పటివరకు ఎంతోమంది దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలతో పాటు జిల్లాను గర్వించదగ్గ స్థాయిలో ఉంచారని కొనియాడారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి రావడం పట్ల దివ్యాంగ విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు తిలకించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దివ్యంగా విద్యార్థులు అయినప్పటికీ కూడా వారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి లూయీ బ్రెయిలీ ద్వారా నేర్చుకుని.. వారి జీవిత చరిత్రను, ఇతర విషయాలను క్లుప్తంగా వివరించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కంటిచూపు లేనప్పటికీ స్పర్శ ద్వారా చదువుతోపాటు సాంస్కృతిక నృత్యాలు, పాటలు , యోగ చేయడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>