నల్లగొండలో దారుణం.. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త!

‎‎కలం, నల్లగొండ : శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ క్వార్టర్స్‌లోనే ఓ మహిళా హోంగార్డు దారుణంగా హత్య (Home Guard Murder) కు గురైంది. కట్టుకున్న భర్తే కసాయిగా మారి భార్య తలను బండకేసి కొట్టి ప్రాణాలు తీసిన ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహబూబ్ బీ (43) తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమె నల్లగొండ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది.

సుమారు 15 ఏళ్ల క్రితం గతంలో హోంగార్డుగా పనిచేసిన సతీష్‌తో ఆమెకు ప్రేమ వివాహం (కులాంతర వివాహం) జరిగింది. కొన్నేళ్ల క్రితం సతీష్ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికావడంతో మహబూబ్ బీనే హోంగార్డుగా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషిస్తోంది. సోమవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య కుటుంబ విషయమై గొడవ ప్రారంభమైంది. మాటమాట పెరిగి వాగ్వాదం తీవ్రం కావడంతో ఆవేశానికి గురైన సతీష్.. మహబూబ్ బీ తలను బండకేసి దారుణంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పాఠశాల నుంచి తిరిగొచ్చేసరికి తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.

హత్య (Home Guard Murder) సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, రూరల్ ఎస్సై శివ ప్రసాద్, వన్‌టౌన్ ఎస్సై నాంపల్లి వెంకట్ నారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారాలు నమోదు చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు.

Also Read : కరువు ప్రాంతాల్లో పంట రుణాల రీషెడ్యూలింగ్ చేయాలి: తుమ్మల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>