నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ గ్రాండ్ బోణీ!

కలం, స్పోర్ట్స్​ : నేషన్స్ లీగ్ (Nations League) కొత్త సీజన్‌లో పోర్చుగల్ శుభారంభం చేసింది. లిస్బన్‌లో వేల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. కొత్త కోచ్ జార్జ్ జెసస్ మార్గదర్శకత్వంలో పోర్చుగల్ ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే పోర్చుగల్ ఆటగాళ్లు వేల్స్ డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచారు. ప్రథమార్ధంలోనే 13 సార్లు గోల్ కోసం ప్రయత్నించారు. మ్యాచ్ 22వ నిమిషంలో జావో ఫెలిక్స్ బాక్స్ బయట నుంచి కొట్టిన బంతి గోల్‌గా మారింది. ఈ గోల్‌తో పోర్చుగల్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో గ్రౌండ్‌లో సందడి చేశారు. కొన్ని మంచి అవకాశాలను ఆయన మిస్ చేసుకున్నారు. మ్యాచ్ 60వ నిమిషంలో రోనాల్డో గోల్ చేసినా, అంపైర్ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. 67వ నిమిషంలో ఆయన మైదానం నుంచి బయటకు వచ్చారు. ద్వితీయార్థంలో వేల్స్ పుంజుకునేందుకు గట్టిగా ప్రయత్నించింది. బెకింగ్ హామ్, జాన్సన్ లీడ్ తీసుకున్నా ఫలితం లేకపోయింది. వేల్స్ ప్లేయర్ బ్రెన్నాన్ జాన్సన్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్ బార్‌కు తగిలి వెనక్కి వచ్చింది. దీంతో లభించిన గోల్ అవకాశాన్ని వేల్స్ చేజార్చుకుంది.

చివరకు పోర్చుగల్ ఒక గోల్ ఆధిక్యంతో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఎక్కువ గోల్స్ చేసే అవకాశాలు వచ్చినా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయినా మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించి మూడు పాయింట్లు సాధించడం పోర్చుగల్‌కు ఊరటనిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>