కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా కిర్లంపూడి (Kirlampudi) గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu ) మంగళవారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విచారణకు హాజరయ్యారు. ముద్రగడ గిరిబాబు నివాసం నుంచి కారులో బయలుదేరిన అంబటి రాంబాబు, ఆ తర్వాత కొద్దిదూరం పాదయాత్రగా పీఎస్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాదయాత్రగా వస్తున్న అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు, గార్డ్ ఆఫ్ ఆనర్ (ప్రభుత్వ లాంఛనాల) నిర్వహణకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై అంబటి రాంబాబు(Ambati Rambabu)పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు అందుకున్న ఆయన, ముద్రగడ గిరిబాబుతో కలిసి కిర్లంపూడి పీఎస్కు చేరుకోగా అధికారులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి విచారణ వార్త తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Also Read : ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం!
Follow Us On : WhatsApp

