రోబోటిక్స్​, ఫిజికల్​ ఏఐ పాలసీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్​ సిగ్నల్​!

కలం, వెబ్​ డెస్క్​: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్​ భేటీ (AP Cabinet Meeting)లో పలు కొత్త పాలసీలు, భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. రోబోటిక్స్‌, ఫిజికల్‌ ఏఐ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే సెమీకండక్టర్‌ పాలసీ సవరణకు కూడా ఆమోదముద్ర వేసింది.

రాంబిల్లిలో ఎప్యాక్‌ డేటా సెంటర్‌ (Epack Data Center) ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. అదానీ క్లౌడ్‌ హబ్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు నాయుడుపేటలో ఏర్పాటు చేయనున్న కార్బన్‌ కాస్మో ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్​ ఓకే చెప్పింది. డిక్సన్‌ టెక్నాలజీస్‌కు భూకేటాయింపులు చేసేందుకు ఆమోదం తెలిపింది

అదేవిధంగా ఏపీ ఏవీజీసీ–ఎక్స్‌ఆర్‌ పాలసీకి సంబంధించిన ప్రతిపాదన కూడా ఏపీ మంత్రివర్గం ముందుకు వచ్చింది. సుమారు 30కి పైగా కీలక అజెండా అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా, విడాకుల ప్రకటన చేసిన మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ (Pawan Kalyan) మంత్రివర్గ సమావేశానికి (AP Cabinet Meeting) హాజరుకావడం గమనార్హం.

Also Read : మోదీతో ఐ కాంటాక్ట్ పై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>