నల్లమలలో కలెక్టర్ హేమంత్ పర్యటన.. అభివృద్ధి పనులపై సమీక్ష!

కలం, అచ్చంపేట: నల్లమలలో పలు అభివృద్ధి పనులతో పాటు, రెవెన్యూ వ్యవస్థపై అవగాహన కల్పించడానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ (Hemanth Keshav Patil) మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తరగతిగదులతో పాటు, పాఠశాల ప్రహరీ గోడను త్వరగా నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం విద్య, వసతుల కల్పనపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సర్వే సభలో పాల్గొని గ్రామస్తులకు సమస్యల పరిష్కారం గురించి వివరించారు. అంతకుముందు మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అర్చకులతో ఆశీర్వచనాలు పొందారు. అదేవిధంగా ఆలయ సమీపంలో త్వరలో ఏర్పాటు చేయబోయే సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్ట స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ అధికారులు, తహశీల్దార్లు, వివిధ శాఖల సిబ్బంది, ఆలయ ఛైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>