కలం వెబ్ డెస్క్ : మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ క్యూట్ బ్యూటీ తమిళ, మలయాళ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ రాజాసాబ్ (raajasaab) సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. మారుతి డైరక్షన్ లో తెరకెక్కిన రాజాసాబ్ మూవీ ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్(Prabhas) తో కలిసి నటించడం గురించి మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్(Salaar) మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అయితే సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ పాత్రకు సంబంధించి ముందుగా మాళవికను సంప్రదించారట.. తాను సలార్ సినిమాతోనే ప్రభాస్ తో నటించే దానినని, మొదటగా ఛాన్స్ తనకే వచ్చిందని మాళవిక తెలిపింది.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయిందని ఆమె తెలిపింది.. సలార్ ఛాన్స్ మిస్ అవడంతో చాలా భాదపడ్డానని కానీ రాజాసాబ్ లో కలిసి నటించే ఛాన్స్ వచ్చినందుకు ఆనందించానని మాళవిక వెల్లడించింది.


