epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పోలీసులపై భరత్ ఘాటు వ్యాఖ్యలు..

ఏపీ పోలీసుల తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్(Margani Bharat) ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అనే వారు ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలి కానీ, శిక్షకులుగా ఉండకూడదన్నారు. నకిలీ మద్యం సిండికేట్ వ్యవహారంలో పోలీసులు ఫేవరిటిజం చూపిస్తున్నారని ఆరోపించారు. నకిలీ మద్యం వ్యవహారంలో రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని, అతనిపై ఫిర్యాదు చేయడానికి తాము ఎస్పీ దగ్గరకు వెళ్తే ఆయన ఫిర్యాదు తీసుకోలేదని అన్నారు. రాజమండ్రి సిటీ, రూరల్ లో మద్యం సిండికేట్ వెనుక ఈవీఎం ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపించారు. దీనిపై బుచ్చయ్యచౌదరి(Butchaiah Chowdary) స్పందించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యంతో కోట్ల రూపాయలు దండుకున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టకూడదని కోరారు. ఈ విషయంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.

Read Also: వైసీపీ ఫెయిల్ అయింది అక్కడే: భరత్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>