కలం, వెబ్ డెస్క్ : నూతన సంవత్సర వేడుకల వేళ నెదర్లాండ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ సెంట్రల్ అమ్ స్టర్ డామ్ లోని 19వ శతాబ్ధానికి చెందిన వోండెల్ కెర్క్ చర్చి (Vondelkerk Church) మంటలకు ఆహుతి అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక ఇబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. చర్చి పక్కన ఉన్న భవనాలకు మంటలు అంటుకోకుండా చర్యలు చేపట్టారు.
కాగా, అగ్ని ప్రమాదంలో చర్చి పూర్తిగా ధ్వంసమై టవర్ కుప్పకూలిపోయింది. పై భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియ రాలేదు. ఫైర్ వర్క్స్ ద్వారానే మంటలు వ్యాపించవచ్చని ప్రాథమిక అంచనా వేసిన అధికారులు విచారణ చేపట్టారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న వోండెల్ కెర్క్ చర్చి (Vondelkerk Church) ని 1870 లో నిర్మించారు.
Read Also: బస్సు, వ్యాన్ ఢీ.. 15 మంది దుర్మరణం
Follow Us On: X(Twitter)


