epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బస్సు, వ్యాన్​ ఢీ.. 15 మంది దుర్మరణం

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్ (Pakistan​) లోని పంజాబ్​ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో పలువురు యూనివర్సిటీ క్రీడాకారులు ఉన్నారు. 20 మంది తీవ్రంగా గాయపడగా, వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెటర్నరీ అండ్​ యానిమల్​ సైన్సెస్​ యూనివర్సిటీకి చెందిన క్రీడాకారులు లాహోర్​ (Lahore) లో జరిగే క్రీడల్లో పాల్గొనడానికి బస్సులో బయల్దేరారు.

జాంగ్​ జిల్లాలోని అడ్డా ఫఖీర్​ ది కులీ ప్రాంతంలోకి వచ్చేసరికి వీరి బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్​ను ఓవర్​టేక్​ చేయబోయి, ఎదురుగా వస్తున్న వ్యాన్​ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని 9 మంది అక్కడిక్కడే మరణించగా, ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వాహనాలు రెండూ మితిమీరిన వేగంతో రావడం వల్లే ఈ రోడ్డు యాక్సిడెంట్​  జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Pakistan
pakistan

Read Also: రూ.900 కోట్ల విలువైన షేర్లు విరాళమిచ్చిన ఎలన్ మస్క్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>