epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫాస్టాగ్​ యూజర్లకు గుడ్​న్యూస్​

కలం, వెబ్​డెస్క్​: ఫాస్టాగ్​ (FASTag) యూజర్లకు నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (NHAI) గుడ్​ న్యూస్​ చెప్పింది. కార్లు, జీప్​లు, వ్యాన్లకు కొత్తగా ఇచ్చే ఫాస్టాగ్​లకు నో యువర్​ వెహికల్​ (KYV)ను నిలిపేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. వెహికల్​కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ వల్ల ఫాస్టాగ్​ యాక్టివేషన్​ ఆలస్యం అవుతున్నట్లు తెలియడంతో ఈ నిబంధనను ఎన్​హెచ్​ఏఐ తొలగించింది. కాగా, ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్​లకు కూడా కేవైవీ అవసరం లేదని చెప్పింది. నిజానికి ఫాస్టాగ్​ను వాహనంపై సరిగా అతికించపోవడం, దుర్వినియోగం చేయడం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అవసరం.

వెహికల్​ డేటాబేస్​లో వివరాలు సరిచూసుకున్నాకే బ్యాంకులు ఫాస్టాగ్​ ఇస్తాయి. ఆ తర్వాత ఫాస్టాగ్​ యాక్టివేట్​ అవుతుంది. అయితే, ఫాస్టాగ్ ​(FASTag) సరైన వాహనానికే లింక్ చేశారా? ముందు భాగంలో విండ్​ షీల్డ్​పై సరిగా అతికించారా? అనేది తెలుసుకోవడం కేవైవీ నిబంధన ముఖ్య ఉద్ధేశ్యం. అందువల్ల వెహికల్​ ఫ్రంట్​, సైడ్​ ఫొటోలు తీసి, ఫాస్టాగ్​ అతికించిన చోటు ఫొటోలు తీసి వాహనదారులు అప్​లోడ్​ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం కేవైవీ రద్దుతో ఈ ఇబ్బంది ఇకపై ఉండదు.

Read Also: బిగ్ బ్రేకింగ్: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>