ఇరుముడి హిట్‌తో రవితేజ భారీగా రెమ్యునరేషన్‌ డిమాండ్!

కలం, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ‘ఇరుముడి’ సినిమాకు వస్తున్న స్పందన రవితేజ మార్కెట్‌పై పాజిటివ్ ప్రభావం చూపిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచి సుమారు రూ.40 కోట్లకు తీసుకెళ్లినట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతుందట.

అయితే, ప్రస్తుతం రవితేజకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పారితోషికాన్ని నిర్మాతలు ఎంతవరకు ఒకే చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ‘ఇరుముడి’ ఇచ్చిన ఊపుతో ఇకపై రవితేజ నటించే ప్రతి సినిమా కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>