కలం వెబ్ డెస్క్ : ప్రపంచమంతా న్యూ ఇయర్ సంబరాల్లో (New Year Celebrations) మునిగి తేలుతుంటే ఓ వైసీపీ(YSRCP) నేత వేడుకలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించాడు. తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని, అందుకే న్యూ ఇయర్ చేసుకోవట్లేదని చెప్పుకొచ్చాడు. ఆయన ఎవరో కాదు.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. ఇటీవల ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయచోటి(Rayachoti)ని జిల్లా కేంద్రం నుంచి తొలగించింది. దీంతో రాయచోటిలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల పాటు ఆందోళనలు కూడా చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.
దీంతో 2026 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని (Rayachoti) తొలగించడం, అన్నమయ్య జిల్లాను విచ్చిన్నం చేసిన పరిస్థితుల్లో వేడుకలు నిర్వహించడం తగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అభిమానులు తప్పుగా భావించొద్దని కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకాంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: నేడు నుమాయిష్.. సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
Follow Us On: Sharechat


