కలం స్పోర్ట్స్: టీమిండియాలోకి బౌలర్ మొహమ్మద్ షమి (Mohammed Shami) ఎంట్రీ ఇవ్వడం ఖాయం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. క్రికెట్ సర్కిల్స్ నుంచి కూడా ఇది నిజమన్న సమాచారమే అందుతుంది. ఇటీవల షమి ఫిట్‌నెస్ విషయంలో చాలా గందరగోళం ఏర్పడింది. షమి ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉండటంతోనే జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్లు చెప్పారు. అయితే తాను ఫిట్‌గా లేకపోతే రంజీల్లో ఎలా ఆడుతున్నానని, ఇవన్నీ సెలక్టర్లు చెప్తున్న బోగస్ మాటలంటూ షమి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు షమి మళ్ళీ టీమిండియా జర్సీ వేుకోనున్నాడన్న టాక్ నడుస్తోంది. న్యూజిల్యాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడే జట్టులోకి షమిని తీసుకోవాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ జనవరి 11న వడోదరలో ప్రారంభం కానుంది.
జస్ప్రిత్ బుమ్రా విశ్రాంతిలో ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాలోకి షమీ తిరిగి వచ్చే అవకాశాలపై చర్చలు మళ్లీ వేడెక్కాయి. దేశవాళీ క్రికెట్‌లో షమి అదరగొట్టాడు. దాంతో మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విజయ్ హజారే ట్రోఫీ: 3 మ్యాచ్‌లు, 6 వికెట్లు, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ: 7 మ్యాచ్‌లు, 16 వికెట్లు, జమ్మూ & కశ్మీర్‌పై 2/14 అద్భుత స్పెల్‌తో బెంగాల్‌కు కీలక విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సెలక్టర్లు షమిని కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచినప్పటికీ షమికీ (Mohammed Shami) ఆ తరువాత జట్టులో చోటు దక్కలేదు. “అతను పరిగణలోనే ఉన్నాడు. ఫిట్‌నెస్‌ను పరిశీలించాల్సి ఉంది. న్యూజిలాండ్ సిరీస్‌కు అతను ఎంపికైతే ఆశ్చర్యపడకండి. 2027 వరల్డ్ కప్ కూడా ఆయనకు సాధ్యమైన లక్ష్యమే” అని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: ఉజ్జయిని మహా కాళేశ్వర్‌లో మహిళా క్రికెట్ టీం ప్రత్యేక పూజలు
Follow Us On : WhatsApp


