కలం వెబ్ డెస్క్ : కొత్త సంవత్సరం(New Year) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని(Telugu States) ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వెస్ట్రన్ కల్చర్‌లో సెలబ్రేషన్స్ చేసుకోవడంలోనే కాదు.. ఆధ్యాత్మికతలోనూ ముందుటామంటూ యువత ఆలయాలకు క్యూ కట్టారు. దీంతో గుడులన్నీ కోలాహలంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, యాదాద్రి తదితర ఆలయాల్లో దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. వేలాది భక్తుల రాకతో తిరుమల ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
పలువురు ప్రముఖులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి తిరుమల(Tirumala)లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని భట్టి కోరారు. తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణలో సర్వతోముఖాభివృద్ధి సాధించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రగతిపథంలో మరింత ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రి(Yadadri)లో ప్రత్యేక పూజలు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించారు.
Read Also: మద్యం అమ్మకాల్లో HYD రికార్డ్.. థర్టీ ఫస్ట్‌కు 350 కోట్లు తాగేశారు!
Follow Us On : WhatsApp


