కలం, వెబ్ డెస్క్: పండుగ ఏదైనా సరే మద్యం ఉండాల్సిందే. బర్త్ డే, మ్యారేజ్ డే.. ఇలా అకేషన్ ఏదైనా డ్రింక్స్ తీసుకోవడం కామన్‌గా మారింది. ఇక స్పెషల్ సెలబ్రేషన్ అయితే కిక్కే కిక్కు. దీంతో మద్యం అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్‌లో భారీగా మద్యం (Liquor Sales) అమ్మకాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో రూ.5050 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం ఆల్ టైం రికార్డ్ అంటున్నారు ఎక్సైజ్ అధికారులు.
సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ (New Year) వేడుకలు కలిసి రావడంతో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఒక్క డిసెంబర్ 31 రాత్రి రూ.350 కోట్లలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ సేల్స్ కారణంగా గత ఐదు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. న్యూ ఇయర్ వేడుకలు, పార్టీల వల్ల చాలామంది మద్యం కొనుగోలు చేస్తున్నారు. 2025లో కొత్త మద్యం విధానం అమలులోకి రావడం, మరింత లైసెన్సులు ఇవ్వటం వల్ల మార్కెట్‌లో స్టాక్ అందుబాటులో ఉండటంతో సేల్స్ ఊహించినస్థాయి కంటే పెరిగాయి.
2025 చివరి నెల డిసెంబర్‌లో హైదరాబాద్‌లోనే (Hyderabad) కాకుండా, తెలంగాణలో మద్యం అమ్మకాలు (Liquor Sales) అత్యధిక స్థాయికి చేరాయి. రోజువారీ అమ్మకాలు కూడా భారీగా నమోదయ్యాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Read Also: హ్యాంగోవర్‌తోనే మెలకువ వచ్చేస్తోంది.. న్యూ ఇయర్‌పై వర్మ వరుస ట్వీట్లు
Follow Us On: X(Twitter)


