కలం వెబ్ డెస్క్ : దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year wishes) తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 2026 సంవత్సరానికి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా. అందరూ జీవితంలో ముందుకు సాగేందుకు ఇది ప్రేరణగా నిలవాలి. అని మోడీ తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో పాటు ఓ ఆసక్తికర సంస్కృత శ్లోకాన్ని(Sanskrit Shloka) జోడించారు. ఒక వ్యక్తిలో ఉండాల్సిన మానవ విలువలు, ఉత్తమమైన గుణాలను చెప్పే ఈ శ్లోకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః.. స్వాతంత్య్రం కౌశలం కాంతిర్ధైర్యం మార్దవమేవ చ.. అంటే జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, బలం, స్మృతి, స్వాతంత్య్రం, నైపుణ్యం, కాంతి, ధైర్యం, వినయం.. ఇవన్నీ కూడిన గుణాలు కలిగి ఉండాలని ఆ శ్లోకం చెబుతోంది.


