epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వామ్మో డ్రంకెన్ డ్రైవ్.. పిల్లలను వదిలేసి పారిపోయిన బాబాయ్

కలం, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ (Drunk Driving) టెస్టులో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. టెస్టులు చేసే సమయంలో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. టెస్టులు నిర్వహిస్తుండగా.. తాను దొరికిపోతానని భావించిన ఓ బాబాయ్ భయంతో పిల్లల్ని సైతం వదిలి పారిపోయాడు. తన బైక్‌ను రోడ్డుపై వదిలేశాడు. ఈ ఘటనతో పోలీసులు షాక్ అవ్వగా, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.

అలాగే వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. తాను మద్యం సేవించలేదని, ట్రాఫిక్ పోలీసులు తనపై చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. ఘటనా స్థలానికి సివిల్ పోలీసులు వచ్చేసరికి ఆ వ్యక్తి పరారయ్యాడు. ఇక హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1198 మంది పట్టుబడ్డారు. నిన్న రాత్రి (డిసెంబర్31) నుంచి ఇవాళ (జనవరి1) తెల్లవారుజాము వరకు పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>