కలం, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తోన్న మూవీ ‘స్పిరిట్’ (Spirit Movie). ఈ భారీ చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ఇటీవల ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ మూవీ నుంచి ఆడియో రిలీజ్ చేయడం.. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. అయితే, న్యూ ఇయర్ వేళ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అభిమానులకు భారీ గిఫ్ట్ ఇచ్చాడు. స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ (Spirit Prabhas First Look Poster) రిలీజ్ చేసి అభిమానులకు పూనకాలు తెప్పించాడు.
సందీప్ రెడ్డి వంగ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రభాస్ స్టార్ డమ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. స్పిరిట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సౌండ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వంగా..
‘స్పిరిట్’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన X (ట్విట్టర్) అకౌంట్‌లో ఈ పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌లో ప్రభాస్ లాంగ్ హెయిర్, బీర్డ్, గ్లాసెస్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. వెనుక భాగం నుంచి చూపించిన ఈ షాట్‌లో ప్రభాస్ భుజాలు, వీపుపై గాయాలు, బ్యాండేజ్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైట్ ప్యాంట్ ధరించిన ప్రభాస్ నోట్లో సిగరెట్ పెట్టి, హీరోయిన్ లైటర్‌తో వెలిగించే సన్నివేశం డార్క్, ఎమోషనల్ వైబ్‌ను సృష్టిస్తోంది.
పోస్టర్ మధ్యలో ‘స్పిరిట్’ టైటిల్ స్టైలిష్ వైట్ ఫాంట్‌లో, రెండు స్టార్స్‌తో డిజైన్ చేయబడింది. టాప్‌లో భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ లోగోలు ఉన్నాయి. క్రెడిట్స్‌లో “ప్రెజెంటెడ్ బై భూషణ్ కుమార్ & టి-సిరీస్”, “ది ఫిల్మ్ బై సందీప్ రెడ్డి వంగా” అని మెన్షన్ చేశారు. ప్రొడ్యూసర్లు ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, మీరా కట్టార్, ప్రభాకర్ రెడ్డి వంగా తదితరులు. బాటమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ అవుతుందని సూచన.ఈ పోస్టర్ రిలీజ్‌తో సోషల్ మీడియా షేక్ అవుతోంది.


