epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎహె ఊదను పో.. డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో సతాయించిన మందుబాబు

కలం, వెబ్​డెస్క్​: న్యూ ఇయర్ జోష్​ మందుబాబులకు బుధవారం సాయంత్రం నుంచే మొదలైంది. చాలా చోట్ల డ్రంక్ అండ్​ డ్రైవ్ ​(Drunk and Drive) లో పోలీసులకు మందుబాబులు చుక్కలు చూపించారు. అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాత్రి వేళ జరిగింది. ఫుల్​గా తాగిన ఓ వ్యక్తి బైక్​ నడుపుతూ.. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ (Drunk and Drive) ​ పరీక్ష లు చేస్తున్న పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్​లో ఊదడానికి మాత్రం ఒక పట్టానా సహరించలేదు. దాదాపు గంటసేపు సతాయించాడు. పోలీసులు బతిమాలినా మాట వినలేదు. ‘ఎహె నేను ఊదను’ అంటూ బ్రీత్​ అనలైజర్​లో ఊదడానికి ఒప్పుకోలేదు. ‘నేను తాగిన.. కానీ, ఊదను’ అంటూ పోలీసుల్ని విసిగించాడు. పోలీసులు బ్రీత్​ అనలైజర్​ నోటిలో ఉంచడం, మందుబాబు ఐదు సెకన్లు కూడా ఊదకపోవడం ఇలా పదే పదే జరిగింది. ఆఖరికి ఎలాగోలా మందుబాబును ఒప్పించిన పోలీసులు బ్రీత్​ అనలైజర్​తో టెస్ట్​ చేసి చూస్తే 89శాతం రీడింగ్​ చూపింది. అనంతరం అతని వయసు అడిగిన పోలీసులు.. 58 అని మందుబాబు చెప్పడంతో ఆ వయసులో అంత ఫుల్​గా తాగి బైక్​ నడపడం అవసరమా అంటూ మందలించారు. వివరాలు కనుక్కొని, చలానా రాసి పంపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>