కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం చేపట్టిన నల్లమలసాగర్ ప్రాజెక్ట్ మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మరోసారి స్పందించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు రూల్స్ కు విరుద్ధంగా చేపట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. గోదావరి జలాల్లో 968 టీఎంసీల వాటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఒక్క టీఎంసీని పోనివ్వబోమని.. ఇదే విషయాన్ని కేంద్రం వద్ద కూడా చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
‘బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టులు (Nallamala Sagar project) చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని.. వాటికి పర్మిషన్ ఇవ్వొద్దని ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాశాం. అలాగే పోలవరం విస్తరణ పనులను కూడా ఆపాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో కోరాం. అటు గోదావరి, కృష్ణా రివర్ బోర్డులు కూడా బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపాయి. కేంద్ర జలశక్తి, కేంద్ర జలసంఘం కూడా ఈ ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు తెలిపాయి. నీటి వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’ అంటూ చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).
Read Also: జానారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
Follow Us On: Instagram


