కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ (JAC) ఛలో అసెంబ్లీ (Chalo Assembly) కి పిలుపునిచ్చింది. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం జనవరి 3వ తేదీన నిర్వహించే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని ఆటో సంఘాల నాయకులు కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తిలో ఉన్న ఆటో డ్రైవర్లు. మహాలక్ష్మీ పథంతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడం వల్ల తమకు ఆదాయం తగ్గిందని కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాల వేళ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ అసెంబ్లీ ముట్టడికి (Chalo Assembly) పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: నల్లమలసాగర్ ప్రాజెక్ట్’ రూల్స్ కు విరుద్ధం : మంత్రి ఉత్తమ్
Follow Us On: Pinterest


