కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కందూరు జానారెడ్డి (Jana Reddy) ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరామర్శించారు. ఇటీవల ఆయనకు మోకాలి ఆపరేషన్ అయింది. దీంతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. జానారెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర రాజకీయాలపై కాసేపు చర్చించినట్లు సమాచారం. శాసనసభ సమావేశాల వేళ జానారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


