విశాఖ పెట్టుబడులపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఆసక్తికర పోస్ట్ ఒకటి పెట్టారు. ప్రత్యర్థి పార్టీ వారిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. ఎక్స్‌లో ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సందర్బంగానే నేడు ఏపీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి స్వాగతం పలికారు. ఆయనను కలవడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ శ్రీశైలం(Srisailam)లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. కీలక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేస్తారు. అంతేకాకుండా రూ.13,429 కోట్ల ప్రాజెక్ట్‌లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింత బలోపేతం కానుంది’’ అని లోకేష్ అన్నారు.
విశాఖలో గూగుల్ పెట్టబడులు(Google Investments) పెట్టడానికి సిద్ధం కావడంపై కూడా లోకేష్ పోస్ట్ పెట్టారు. అందులో వైసీపీ టార్గెట్‌గా సెటైర్లు వేశారు. ‘‘ఆంధ్ర ఆహారానికి ఘాటు, మంట ఎక్కువ అని అంటారు. ఇప్పుడు పెట్టుబడులకు కూడా అది వర్తిస్తున్నట్లు ఉంది. ఆంధ్రకి వచ్చిన పెట్టుబడులు చూసి కొందరు మండిపోతున్నారు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు నారా లోకేష్(Nara Lokesh).

Read Also: అమెరికా విషయంలో మౌనమెందుకు: రాహుల్

