కలం, స్పోర్ట్స్ : ఛాంపియన్స్ లీగ్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో లయాన్‌పై 2-1 తేడాతో గెలిచి, అగ్రిగేట్ 3-2తో ఫెనర్బచే (Fenerbahce) ముందంజ వేసింది. అయితే మ్యాచ్ విజయం కంటే మైదానంలో జరిగిన రచ్చ రంబోలానే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో లయాన్ చిరకాల ప్రత్యర్థి మార్సెయిల్ తరఫున ఆడిన ఫెనర్బచే ఆటగాళ్ళు గ్వెండోజీ, మేసన్ గ్రీన్వుడ్‌లు మ్యాచ్ ముగియగానే ఘర్షణకు తెరలేపారు. ఇరు జట్ల ఆటగాళ్ళు, కోచింగ్ సిబ్బంది రణరంగంలా మారిన మైదానంలో ముష్టిఘాతాలకు దిగడంతో యుయేఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
లయాన్ అభిమానులను తీవ్రంగా రెచ్చగొట్టడమే కాకుండా, కనీస మర్యాదపూర్వక నిబంధనలను ధిక్కరించిన ఆర్సెనల్ మాజీ మిడ్‌ఫీల్డర్ గ్వెండోజీపై యుయేఫా ఉక్కుపాదం మోపింది. మొత్తం నాలుగు యుయేఫా క్లబ్ మ్యాచ్‌లలో ఆడకుండా అతనిపై సస్పెన్షన్ విధించింది. ఇందులో రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఏడాది పాటు ప్రాబేషన్ పీరియడ్‌లో ఉంచినప్పటికీ, వెంటనే రూ. 50,000 యూరోల (సుమారు $58,000) జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పేసింది.
ప్రత్యర్థి ప్రేక్షకులకు మధ్యవేలు చూపిస్తూ రెచ్చగొట్టడమే ఈ గొడవకు ప్రధాన కారణమని రిపోర్టులు స్పష్టం చేశాయి. మాంచెస్టర్ యునైటెడ్ మాజీ సంచలనం మేసన్ గ్రీన్వుడ్ కూడా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లు రుజువు కావడంతో అతనికి 30,000 యూరోల పెనాల్టీ పడింది. దీనితో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించినా, దాన్ని సస్పెండెడ్ హోదాలో ఏడాది కాల పరిమితితో ప్రాబేషన్ కింద పెట్టింది.
Also Read : షమీపై ఇషాన్ కిషన్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us on : WhatsApp

