ఉట్నూరులో ఘనంగా గురు పూజోత్సవం

కలం, ఉట్నూరు : ఉపాధ్యాయులు స్వీయ ప్రేరణతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేసి, మెమొంటోలు బహూకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల విద్యార్థులు మాతృభాష నుంచి ప్రధాన ధారలోకి వచ్చి, మెరుగైన విద్యా ప్రమాణాలు సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషితో పాటు స్వీయ ప్రేరణ కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఈఎంఆర్ఎస్ లలో తొలిసారిగా ఎఫ్ఎల్‌ఎన్ (FLN) అమలు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఉత్తమ బోధనా పద్ధతులను తోటివారితో పంచుకుంటూ, విద్యార్థులలో డ్రాపౌట్లు లేకుండా ఉన్నత చదువులు, కెరీర్ గైడెన్స్ అందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>