కలం, వలిగొండ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) నోటీసుల ప్రక్రియను శనివారం వలిగొండ తహసీల్దార్ దశరథ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ నోటీసులు అందిన ఓటర్లు తమ ఓటు తొలగిపోకుండా ఉండేందుకు అవసరమైన సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు కొనసాగేందుకు నోటీసులకు సంబంధించి అవసరమైన ఆధారాలను సమర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, జీపీఓలు భాజ వెంకటేశం, స్రవంతి, బీఎల్వోలు పాల్గొన్నారు.

