కలం, వెబ్ డెస్క్: ఏపీలో గ్రామాలకు పూర్తి స్థాయి తాగునీరు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గ్రామీణ ప్రజలకు తాగు నీటి వ్యవస్థల బలోపేతానికి ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ పనులు ముమ్మరం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు ఇప్పటికే రూ. 26,000 కోట్లతో జేజేఎం-అమరజీవి జలధారల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ తాగునీటి కోసం ప్రత్యేకంగా రూ. 35 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో దాదాపు 370 గ్రామాల పరిధిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లు పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీటి సరఫరా చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ చేపడుతున్నట్లు వివరించారు.
Also Read : బీజేపీ చెత్త కుప్ప కాదు: మురళీధర్ రావు
Follow Us on : WhatsApp

