100 రోజుల్లో లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది? కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విమర్శలు

కలం, నిర్మల్: కాంగ్రెస్ సర్కార్‌ 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ నిర్మల్ (Nirmal) నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి (Ramkishan Reddy) అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలు అమలు చేయలేదని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ (Bike Rally) నిర్వహించారు.

అనంతరం స్థానిక మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ వద్ద యువతతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, విద్యా భరోసా కార్డులు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, యూత్ డిక్లరేషన్‌లోని ప్రతి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, సీనియర్ నాయకులు గండ్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>