కలం, నిర్మల్: 22ఏ, భూ భారతి పేరుతో ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా (BJP Maha Dharna) కు నిర్మల్ నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) నేతృత్వంలో చేపడుతున్న మహాధర్నాను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీజేపీ శ్రేణులు సుమారు 200 వాహనాల్లో హైదరాబాద్ కు బయలుదేరారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
Also Read : సర్కార్ బడిలో చదివి సీఎం అయ్యాను: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

