పాక్‌పట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం

కలం, సోన్‌: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సోన్‌ మండలం పాక్‌పట్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Pakpatla High School) శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు గురువుల సేవలను కొనియాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్‌, గటిక రవికాంత్‌, శ్రీధర్‌, రత్నాకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>