‘కుడా’ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి బాధ్యతల స్వీకరణ

కలం, హనుమకొండ : కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి (Gundu Sudharani) పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం కుడా కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో వరంగల్‌ మహానగర మేయర్‌గా పనిచేసిన గుండు సుధారాణికి పట్టణాభివృద్ధి, నగర పరిపాలనపై అనుభవం ఉంది. కుడా పరిధిలో మాస్టర్‌ప్లాన్‌ అమలు, మౌలిక వసతుల అభివృద్ధి, పార్కులు, రహదారులు, పట్టణ విస్తరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.

Also Read : తెలంగాణ‌లో ఏఐ రంగంలో భారీ పెట్టుబ‌డి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>