బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు అథ్లెట్ ప్ర‌తిభ‌!

క‌లం, వెబ్‌డెస్క్: సోష‌ల్ మీడియాలో కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను ట్రోలింగ్ చేస్తున్నారంటూ అథ్లెట్ త‌క్క‌డ‌ప‌ల్లి ప్ర‌తిభ (Athlete Pratibha) బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు. ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌ల‌తో కొద్ది రోజులుగా ప్ర‌తిభ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆమె చేసిన వ్యాఖ్యల‌తో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచ‌రులు కొంద‌రు త‌న‌నే బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. అస‌భ్యంగా తిడుతూ వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఐదు సోష‌ల్ మీడియా ఖాతాల వివ‌రాలు పోలీసుల‌కు అంద‌జేశారు. ప్ర‌తిభ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో త‌న‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేధింపుల‌కు గురి చేశార‌ని, అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు పెట్టార‌ని ప్ర‌తిభ (Athlete Pratibha) ఇంట‌ర్వ్యూలో ఆరోపించారు. తాను వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆ వేధింపులు ఆగిన‌ట్లు తెలిపారు. అయితే దీనిపై గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా ఆమె ఆరోప‌ణ‌లు చేశారు. కానీ, అప్పుడు మంత్రి పీఏపై ఆరోప‌ణ‌లు చేసి, ఇప్పుడు నేరుగా మంత్రినే అనడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ్రీనివాస్ గౌడ్ దీనిపై స్పందిస్తూ ఆమె పొర‌పాటుగా అలా అని ఉండ‌వ‌చ్చ‌న్నారు. కానీ, ప్ర‌తిభ మాత్రం త‌న వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి వివ‌ర‌ణ‌ ఇవ్వ‌లేదు. అయితే త‌న‌కు ఎలాంటి రాజ‌కీయ పార్టీ అండ‌దండ‌లు లేవ‌ని, తాను కేవ‌లం క్రీడా స‌మ‌స్య‌ల‌పై ఒంట‌రి పోరాటం చేస్తున్నాన‌ని ప్ర‌తిభ స్ప‌ష్టం చేశారు.

Also Read : కేబినెట్‌లో చోటు ఎవరికి.. నిజామాబాద్ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>