epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్

కలం డెస్క్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి సర్కారు గిఫ్ట్ అందించనున్నది. ప్రస్తుత సీజన్‌కు రైతుభరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేయనున్నది. ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక శాఖ కూడా సానుకూలంగానే స్పందించింది. దాదాపు రూ. 9 వేల కోట్లను రెడీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్ళించకుండా సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వరినాట్లు పడగా (Sankranti) మరికొన్ని జిల్లాల్లో ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 6 వేల చొప్పున (ప్రస్తుత సీజన్) రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనున్నది. సుమారు 67 లక్షల మంది రైతులకు ఈ సాయం అందించనున్నట్లు అంచనా.

జిల్లాలవారీగా తేలిన సాగుభూమి లెక్క :

సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతుభరోసా (Rythu Bharosa) సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా ఏయే జిల్లాల్లో ఎంత మేర సాగులో ఉన్నదో రెండు వారాలుగా సర్వే జరుగుతూ ఉన్నది. శాటిలైట్ మ్యాపింగ్ విధానంలో ఇమేజ్‌లను సేకరించిన ప్రభుత్వం జిల్లాలవారీగా సాగుభూముల లెక్క తేల్చింది. కొన్ని జిల్లాల్లో సంపన్నుల ఫామ్ హౌజ్‌లు వ్యవసాయ భూముల్లోనే ఉండడంతో రికార్డుల్లో అవి సాగుభూములుగానే ఉన్నాయి. ‘నాలా’ కన్వర్షన్ చేయని కారణంగా అవి కూడా సాగుభూముల లెక్కల్లోకే వస్తున్నాయి. కానీ సేద్యం జరగకపోవడంతో ఇలాంటి భూములకు కూడా రైతుభరోసా సాయం అందించరాదని ప్రభుత్వం భావించింది. డేటాను క్రోడీకరించి సంక్రాంతి టైమ్‌కు రైతుభరోసా ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గత సీజన్‌ తరహాలోనే ఈసారి కూడా :

వానాకాలం సీజన్‌తో పోలిస్తే యాసంగిలో సాగు విస్తీర్ణం కాస్త తక్కువగానే ఉంటుంది. గత సీజన్‌లో ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే సుమారు 67 లక్షల మంది రైతులకు రూ. 8,284 కోట్ల మేర నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. సుమారు 1.38 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందింది. ఈసారి సాగు విస్తీర్ణం కాస్త తగ్గినా స్వల్ప తేడాతో అంతే స్థాయిలో రైతులకు రైతుభరోసా అందనున్నది. దాదాపు రూ. 8 వేల కోట్లు కనీస స్థాయిలో అవసరం ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా. డిసెంబరు ప్రారంభంలోనే రైతుభరోసా నిధులు అందుతాయని ఆశించిన రైతులకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో రావచ్చనే అంచనాకు వెళ్ళారు. కానీ సంక్రాంతి పండుగకే ఇచ్చేలా నిధులను సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లడంతో పండుగ కానుగా సాయాన్ని అందుకోనున్నారు.

Read Also: ఆ కంటెంట్ తీసేయండి.. సోషల్ మీడియా యాప్ లకు కేంద్రం వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>