తెలంగాణలో అప్రకటిత కర్ఫ్యూ: ఆర్ఎస్ ప్రవీణ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 2023 డిసెంబర్ నుంచి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు ముందే వచ్చి అడ్డుకుంటున్నారని విమర్శించారు. సెప్టెంబర్ మూడో తేదీన కేటీఆర్ హాజరయ్యే మిర్యాలగూడ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు.

సాధారణ సభలను కూడా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పోలీస్ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందన్నారు. రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీ సీవీ ఆనంద్ డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నారని ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి వంటి సమయాల్లో విధించే పోలీస్ యాక్ట్‌ను మామూలు సభ పెట్టుకుంటామంటే విధించడమేంటన్నారు.

సీఎం నివాసం ముట్టడిస్తామా..?

బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునివ్వలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మరి ఎందుకు కేటీఆర్ సభకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం తమ నేతలను సభలకు వెళ్లకుండా అడ్డుకుంటోందన్నారు. గతంలో సనత్ నగర్ సభకి ఇలాగే ఆటంకం కలిగిస్తే.. హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలు, సాధారణ పరామర్శలు చివరికి బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి వెళ్దామన్నా కూడా పోలీసులు పొద్దున్నే వచ్చి అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>